Header Banner

పసిడి కొనుగోలుదారులకు ఊరట ! వేల రూపాయల తగ్గుదల! ఈరోజు రేటు ఎంతంటే!

  Sat Apr 05, 2025 10:33        Business

గత ఏడాది కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం ఒక్కరోజే భారీ కుదుపు చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 31.10 గ్రాముల (ఔన్సు) మేలిమి బంగారం ధర $80లకు పైగా తగ్గగా, వెండి ధర కూడా కిలోకు భారీగా పడిపోయింది. దీని ప్రభావంతో దేశీయంగా కూడా ధరలు పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం రాత్రి వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,400 తగ్గి రూ.91,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర రూ.8,000 కంటే ఎక్కువగా తగ్గి రూ.89,800కి చేరింది. ఈ నెల 1వ తేదీన బంగారం ధర రూ.94,000 దాటగా, ఇప్పుడు రూ.3,000కి పైగా తగ్గింది. వెండి ధర కూడా కేవలం రెండు రోజుల్లో రూ.1.02 లక్షల నుంచి రూ.12,000కు పైగా పడిపోయింది.

 

ఇది కూడా చదవండి: భారతదేశం జాక్‌పాట్‌.. భారీగా బయటపడ్డ బంగారం! త్వరలోనే ఒక్కసారిగా పాతాళంలోకి గోల్డ్ రేట్స్..?

 

ఈ తగ్గుదల వెనుక ముఖ్యమైన కారణం మదుపర్ల లాభాల స్వీకరణ అని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 35% పెరగగా, ఈ ఏడాది మాత్రమే 20% పెరిగాయి. ధరలు గరిష్ఠానికి చేరడంతో మదుపర్లు లాభాలను రియలైజ్ చేసేందుకు విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఆభరణాల విక్రయాలు 70% తగ్గిపోయాయని, పాత ఆభరణాలను మార్పిడి చేసి కొత్తవిగా తీసుకునే ప్రవర్తన పెరిగిందని విక్రేతలు తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా విధించిన టారిఫ్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇప్పుడు శాంతి చర్చలు ముందుకు సాగుతుండటంతో, బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముందని బులియన్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే, రూపాయి బలపడడం కూడా దేశీయంగా ధరలు తగ్గడానికి దోహదపడింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగాపరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #GoldRateToday #SilverRateToday #GoldPriceDrop #SilverPriceDrop #TodayGoldPrice #GoldUpdate #BullionRates #GoldVsSilver